ఆధ్యాత్మిక జ్ఞానము

జై గురుదెవ్
*** India is the only place where, with all its faults, the soul finds its freedom, its God. ***
*** Love opens the most impossible gates; love is the gate to all the secrets of the universe. ***
*** To Know God is to become God ***



Thursday 20 August 2009

సరదాగా రండి ! సంపూర్ణ ఆరోగ్యం పొందండి!

సరదాగా రండి ! సంపూర్ణ ఆరోగ్యం పొందండి! ************************************************** ధ్యానం
యోగా కాదు, దైవరూపాన్ని ఊహించడం కాదు! ధ్యానం అంటే ప్రార్ధన కాదు, స్తోత్రం కాదు, నామస్మరణ కాదు, మంత్ర జపం కాదు. ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస, బుద్ధ ప్రభోధిత ఆనాపానసతి. **************************************************************** ధ్యానం చేసే పధ్ధతి
ధ్యానం అంటే స్థిర సుఖాసనంలో కూర్చొని చేతులు రెండు కలిపి వేళ్ళలో వెళ్ళు పెట్టుకొని కళ్ళు రెండు మూసుకొని సహజంగా జరుగుతున్నా ఉచ్చ్వాస నిశ్వాసలను గమనించడమే. ఏ విధమైన మంత్రాన్ని ఉచ్చరించరాదు. ఏ దైవరూపాన్ని ఊహించరాదు. మధ్యమధ్యలో ఏవిధమైన ఆలోచనలు వస్తున్నా వాటిని యెప్పటికప్పుడు కట్ చేస్తూ మళ్ళీ శ్వాసమీద ధ్యాస నిలుపుతూ ఉంటే శ్వాస క్రమక్రమంగా చిన్నదవుతూ తనంతట తానే భ్రూమధ్యంలో స్థితమవుతుంది. చక్కటి ఆలోచనారహిత స్థితిలో విశ్వశక్తి ఆవాహనం జరిగి తద్వారా నాడీమండల శుద్ధి మఱియు ఎన్నో శారీరక ఆత్మానుభవాలు కలుగుతాయి.
ధ్యానం చేయడానికి ప్రత్యేక సమయ సందర్భాలు ఏమీలేవు. పిల్లలకు, పురుషులకు, స్త్రిలకు, వృద్ధులకు అందరికి ఒకే ధ్యాన పద్ధతి. ఎవరి వయస్సు ఎన్ని సంవత్సరాలో అన్ని నిమిషాల ధ్యానం ఒక సిట్టింగ్ లో అది మినిమమ్ - ఆపై మీ ఇష్టం !
******************************************************************* ధ్యానం వలన లాభాలు
శారీరక ఆరోగ్యం - మానసిక ప్రశాంతత - బుద్ధి సూక్ష్మత - ఏకాగ్రత - జ్ఞాపకశక్తి - ఆత్మవిశ్వాసం - పరస్పర అవగాహనా - నిత్య జాగరూకత - సూక్ష్మ శరీర యానం - దివ్య చక్చువు ఉత్తేజితం - ఆత్మజ్ఞానం
******************************************************************* ఫిరమిడ్ అద్భుత శక్తి
ప్రకృతి సహజంగా ఉండే విశ్వమయ ప్రాణశక్తి ఫిరమిడ్ ఆకారంలో ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేక కొలతల వలన విశ్వమయ ప్రాణశక్తి ఫిరమిడ్ లోకి కేంద్రీకరింపబడి శక్తి వంతమైన జీవ శక్తిగా మారి, ధ్యానం చేసే విద్యార్ధులకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, తెలివి, ప్రతిభ అభివృద్ధి చెందుతాయి. అలాగే వృత్తి, వ్యాపర రంగాలోన్ని వారు అద్భుతమైన ప్రగతి సాధిస్తారు.ఫిరమిడ్ లో కుర్చుని ధ్యానంలో నిమగ్నమైనప్పుడు అన్ని రకాల అనారోగ్యలా నుండి స్వస్థత పొందడానికి, మానసిక ప్రశాంతతకు ఉపయోగపడుతుంది. పిరమిడ్ శక్తి వలన శరీరంలోని 72 వేయి నాడులు శుద్ధి చేయబడి, పని చేసే సామర్ధ్యాన్ని పెంపొందిస్తుంది. ఇందువలన దీర్ఘాయుస్షు కూడా సాధ్యం.
***************************************************************************** నోటిలోని మౌనం - మనస్సులోని శూన్యం - అదేకదా ధ్యానం - శ్వాసే కదా మార్గం.. ధ్యానం సర్వరోగ నివారిణి * ధ్యానం సర్వభోగకారిణి * ధ్యానం సర్వజ్ఞాన ప్రసాదిని.. నీ వాస్తవానికీ నీవే సృష్టికర్తవు * మన ఆలోచనలే మన వాస్తవాలు * మన జీవితాలకు మనమే కర్తలం. ******************************************************************************